ప్రస్తుతం అద్దె గర్భానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ అద్దె గర్భాన్ని ఇంగ్లీషులో సరోగసీ అంటారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సరోగసి విధానాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి చాలా మంది తమ కుటుంబాలను వృద్ధి చేసుకోవడానికి గర్భాన్ని ఆశ్రయించారు.
అసలు సరోగసి అంటే ఏమిటి..?
ఎప్పుడైతే ఒక జంట పిల్లలను కావాలని అనుకుంటారు కానీ ఆ సందర్భంలో వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉండొచ్చు. అందుకు కారణం తల్లిదండ్రులు జన్యు సంబంధిత సమస్య కావటం ఒక కారణం. ఈ సరోగసి అనే పద్ధతిలో తండ్రి యొక్క వీర్యాన్ని వేరొక స్త్రీ లోకి చొప్పించడం జరుగుతుంది. ఆ మహిళ తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి కన్న తర్వాత, ఆ బిడ్డను ఆ జంటకు ఇవ్వడం జరుగుతుంది. సాంప్రదాయబద్దంగా పెరిగే అద్దె గర్భం ప్రక్రియ అంటే ఇదే. అయితే మన దేశంలో కొనసాగడం లేదు… ఇది చట్టవిరుద్ధం. అయితే ఈ పద్దతి ఉక్రెయిన్ దేశంలో అమలులో ఉంది.
ముఖ్యంగా వాణిజ్య సరోగసీని అనుమతించే ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో ఉక్రెయిన్ ఒకటి. ఇంకేం ముంది.. పిల్లలు కావాలనుకున్న వారు ఉక్రెయిన్ దేశానికి లైన్ కడుతున్నారు. సొంతంగా పిల్లలు పుట్టలేని జంటలు ఉక్రెయిన్‌కు తరలివస్తున్నారు. అంతేకాదు ఉక్రెయిన్ దేశాన్ని ఇప్పుడు ‘బేబీ ఫ్యాక్టరీలు’ అని పిలుస్తారట. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు 2,500 మరియు 3,000 మంది పిల్లలు ఉక్రెయిన్‌లో విదేశీ తల్లిదండ్రుల కోసం సరోగసీ ద్వారా జన్మిస్తున్నారట. ఈ దేశానికి ఎక్కువగా చైనీయులు ఎక్కువగా ఉన్నారట. అయితే ఒక్కో శిశువుకు రూ .40 నుంచి 42 లక్షల మధ్య ధరను ఫిక్స్ చేసిందట ఉక్రెయిన్. అయినప్పటికీ డిమాండ్ విపరీతంగా ఉందట.