కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రోగనిరోధక శక్తి ని పెంచే సూప్.. తయారు చేసుకోండిలా..

-

మహమ్మారి కారణంగా ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్ధ పెరిగింది. ఆహారం విషయంలో శరీరానికి మేలు చేసేదే తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా బారి నుండి తప్పించుకోవడానికి రోగనిరోధక శక్తి Immunity చాలా అవసరం అనుకున్న అందరూ దాన్ని పెంచే ఆహారాల కోసం శోధిస్తున్నారు. ఈ విషయంలో అంతర్జాలంలో అనేక ఆహారాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం తెలుసుకోబోయేది అలాంటిదే. కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే పసుపుతో తయారు చేసిన సూప్ గురించి ఇక్కడ చూద్దాం.

రోగనిరోధక శక్తి/ Immunity
రోగనిరోధక శక్తి/ Immunity

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న ఇది తాగితే మరింత ప్రయోజనకంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని వారి భావన.

దీనికి కావాల్సిన పదార్థాలు

1టేబుల్ స్పూన్ నెయ్యి
1 ఉల్లిగడ్డ
1టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి
2 అంగుళాల పొట్టు తీసేసిన పసుపు
1.5టేబుల్ స్పూన్ అల్లం
3క్యారెట్లు
1 నిమ్మకాయ

తయారీ పద్దతి

ఒక పాత్రలో నెయ్యి పోసుకుని వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ వేసుకుని కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లి, పసుపు, అల్లం కలుపుకుని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత క్యారెట్లు వేసి 20నిమిషాలు అలాగే ఉంచాలి.

ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. పై నుండి నిమ్మరసాన్ని పిండుకుని వేడి వేడిగా మీకు ఇష్టమైన వాళ్ళకి అందివ్వండి.

ఒకసారి ప్రయత్నించు చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news