కాంగ్రెస్‌కి ఇదే పెద్ద తలనొప్పి… వెనక్కి లాగుతున్నారా?

-

సాధారణంగా రాజకీయ పార్టీల నేతలు…తమ అధినేతల మాటలకు కట్టుబడి ముందుకెళ్తారు. ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా నాయకులు తమ అధిష్టానాలు చెప్పినట్లు నడుచుకుంటారు. ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే, వాటిని అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్తితి ఉండదు….ఏదైనా నాయకులు బహిరంగానే మాట్లాడుతారు. అసలు పార్టీలో అంతర్గత ప్రజస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.

congress

అందుకే నేతలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అసలు సొంత పార్టీ నేతలే విమర్శలు చేసుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. ఇలాంటి పరిస్తితి కాంగ్రెస్‌కు బాగా డ్యామేజ్ జరిగేలా చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోయి ఉంది. ఈ క్రమంలోనే టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా వచ్చిన రేవంత్ రెడ్డి…పార్టీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రేవంత్‌ని ప్రత్యర్ధులు కాదు…సొంత పార్టీ నేతలే కిందకు లాగుతున్నారు.

ఇప్పటికే రేవంత్‌కు పి‌సి‌సి ఇవ్వడంపై చాలామంది సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఏదో మొహమాటం కొద్ది రేవంత్ వెనుక పనిచేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు పార్టీకి డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం రేవంత్‌ని ఉద్దేశించి ఫైర్ అయ్యారు. తనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విధంగా మాట్లాడారు. మొన్న గజ్వేల్ సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో ఏ ఒక్కరూ హీరోలు కాలేరని, రేవంత్ పి‌సి‌సి కాకముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యేని అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

అయితే పార్టీ పరిస్తితులని బట్టి నాయకులు నడవాల్సిన అవసరముంది. ఏమన్నా ఇబ్బందులు ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి. కానీ జగ్గారెడ్డి బయటే రచ్చ చేస్తున్నారు. దీని వల్ల ఆయనకు వచ్చేది ఏమి లేదు…అలాగే పార్టీకి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఈ సంస్కృతికి స్వస్తి చెబితే బెటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version