Sirivennela Sitaramashastri : సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవిత చరిత్ర ఇదే !

-

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇవాళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 4;07 నిమిషాలకు తుది శ్వాస విడిచారు సిరివెన్నెల. లంగ్ క్యాన్సర్ సంబంధిత లక్షణాలతో మరణించారు సీతారామశాస్త్రి. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇప్పటి వరకు చాలా రకాల పాటలు రాశారు. అలాగే ఎన్నో అవార్డులు తెచ్చుకున్నారు. ఆయన గురించి.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కుటుంబం – జననం :

విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న జన్మించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిరివెన్నెల అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. సీతారామశాస్త్రి ఇంటి పేరు మార్చిన కళాతపస్వి కె.విశ్వనాథ్ సిరివెన్నెల చిత్రం. సిరివెన్నెలకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు రాజా, యోగేష్ ఉన్నారు.
విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివిన సిరివెన్నెల.. మొదట్లో “భరణి” పేరుతో కవితలు రాశారు. గంగావతరణం కవిత చూసి సిరివెన్నెల చిత్రంలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు విశ్వనాథ్.. సుమారు 3 వేలకుపైగా పాటలు రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అలాగే 165కుపైగా చిత్రాలకు పాటలు రాసిన సిరివెన్నెల.. మూడున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రచయితగా రాణించారు. 2019లో పద్మశ్రీ అందుకున్న సిరివెన్నెల.. ఇప్పటి వరకు 11 నంది పురస్కారాలు అందుకున్నారు.

కెరీర్ :

మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో మూడు వేలకుపైగా పాటలు రాశారు సిరివెన్నెల. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం` సిరివెన్నెల రాసిన మొదటి పాట కాగా… చివరగా ఆయన అఖిల్‌ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో `చిట్టు అడుగు` అనే పాటని రాశారు. వేటూరి శిష్యుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల పాటలరచయిత మాత్రమే కాదు, కవి, సింగర్‌ కూడా. `గాయం` సినిమాలో `నిగ్గ దీసి అడుగు.. `అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. సిరివెన్నెల సినీ సాహిత్యానికి చేసిన సేవలకుగానూ `2019లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 11 నంది అవార్డులు అందుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. `సిరివెన్నెల`, `శృతి లయలు`, `స్వర్ణకమలం`, `గాయం`, `సుభలగ్నం`, `శ్రీకారం`, `సింధూరం`, `ప్రేమ కత`, `చక్రం`, `గమ్యం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాలకు కూడా అవార్డులు అందుకున్నారు. ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశాడు.. త్రిబుల్ ఆర్ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి..తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి పనిచేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version