లాక్ డౌన్ తర్వాత కీలక నిర్ణయం ఇదే…!

-

దేశ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ చాలా వరకు కఠినం గా అమలు చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రతీ రోజు కరోనా కేసులు వందల్లో నమోదు కావడం తో ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. మే 3 తర్వాత లాక్ డౌన్ ని ఎత్తేసే అవకాశం ఉందనేది ఇప్పటి వరకు అందరూ భావిస్తున్న అంశం. కాని అది అప్పటితో అయ్యే అవకాశం లేదని అంటున్నారు.

మే 3 కాదు మే 20 వరకు లాక్ డౌన్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 550 కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ ప్రకటిస్తే ఇప్పుడు 27 వేలు ఉన్నాయి. అంటే 22 వేల కేసులు పెరిగాయి. ఇంకా ఎక్కడ ఏ విధంగా కట్టడి అయినట్టు…? అందుకే ఇప్పుడు లాక్ డౌన్ ని కొనసాగించాలని కాని విదేశాల్లో ఉండే మన పౌరులను తీసుకొస్తే మంచిది అని కేంద్రం భావిస్తుంది. అమెరికా సహా గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళను తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది.

ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, గల్ఫ్ ద్శాల్లో ఉండే వాళ్ళను తీసుకుని రావాలని మోడీ విదేశాంగ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. వాళ్ళు అందర్ని 28 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచడం మంచిది అనే అభిప్రాయం మోడీ కూడా వ్యక్తం చేసారు. అదే విధంగా వలస కార్మికుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఏ రాష్ట్రం వాళ్ళను ఆ రాష్ట్రానికి పంపాలని భావిస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల్లో భారీగా ఉన్నారు. వీళ్ళను తరలించాలి అని భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news