నాలుక పీకేస్తుంది సార్ మోడీ గారూ.. మా దినానికి ఈ లాక్ డౌన్ ఇన్ని రోజులు ఎందుకు సార్. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంది సార్… ఒకరి తర్వాత ఒకరు తీసుకుంటాం సార్ మీ పుణ్యం ఉంటది మద్యం షాపులకు అనుమతి ఇవ్వండి సార్. చాలా మంది పైకి చెప్పుకోలేని ఆవేదన ఇది. ఎప్పుడు తెరిస్తే ఎప్పుడు తెచ్చుకుంటాం అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి కేంద్రం షాక్ ఇచ్చింది.
కొవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై నిషేధం యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా వివరంగా అన్ని విధాలుగా చెప్పేసింది. గ్రామీణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్‌లో షాపులు మినహా అన్ని షాపులు తెరిచేందుకు అవకాశం ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. పట్టణ ప్రాంతాల్లో అన్ని స్వతంత్ర దుకాణాలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
మార్కెట్లు, మార్కెట్ సముదాయాలు, మాల్స్‌లోని షాపులను మాత్రం తెరిచేందుకు వీల్లేదని కేంద్రం తన ఆదేశాల్లో స్పష్టంగా హేప్పింది. షాపుల వద్ద మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరని హెచ్చరించింది. ఈ-కామర్స్ కంపెనీలు నిత్యవసర వస్తువులను మాత్రమే విక్రయించడానికి గానూ అనుమతులు ఇచ్చింది. కరోనా హాట్‌స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లలో ఒక్క షాపు కూడా తెరిచేందుకు వీల్లేదని పేర్కొంది కేంద్రం.