భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేయడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది… ఇప్పుడు ఇక్కడి వరకు మనం రోజు చదువుతూనే ఉన్నాం. కాని ఇప్పుడు కరోనా మరణాల విషయం మాత్రం హైలెట్ అవుతుంది. అమెరికా తర్వాత రోజు వారీ మరణాల్లో భారత్ ముందు ఉంది. భారత్ మరణాలను ఎదుర్కోవడం చాల కష్టంగా ఉంది.
41 వేల మంది మరణించారు అంటే అది అంత ఈజీ కాదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మరణాలను కట్టడి చేయడమే కేంద్ర ప్రభుత్వానికి పెను సవాల్ గా ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో మరణాల శాతం పెరుగుతుంది. కేసులు పెరుగుతున్నాయి మరణాలు ప్రతీ రోజు వెయ్యి వరకు నమోదు అవుతున్నాయి. మరణాలను కట్టడి చేయలేదు అంటే మాత్రం జరిగే నష్టం చాల తీవ్రంగా ఉంటుంది. ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడులో దాదాపు ప్రతీ రోజు 350 మంది వరకు మరణిస్తున్నారు.