వడ్డే నవీన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న బంధుత్వమిదే..

-

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన నటించబోయే నెక్స్ట్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. తండ్రికి తనయుడిగా మాత్రమే కాకుండా తాతకు తగ్గ మనవడిగా తారక్ చక్కటి పేరు సంపాదించుకుని సినీ ఇండస్ట్రీలో హీరోగా దూసుకుపోతున్నాడు.

ఈ సంగతులు పక్కనబెడితే అలనాటి హీరో వడ్డే నవీన్ గురించి ఈ తరానికి కొంత పరిచయం లేదు. కానీ, అప్పట్లో ఆయన నటించిన మూవీస్ బాగా ఆడాయి. లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న వడ్డే నవీన్ ఆ తర్వాత కాలంలో మాత్రం సినిమాల్లో నిలబడలేకపోయారు.

ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వడ్డే నవీన్ చిత్రాలను టీవీల్లో ప్రేక్షకులు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. నవీన్ ఫాదర్ ప్రొడ్యూసర్ కాగా, ఆ క్రమంలోనే వడ్డె నవీన్ కు పిక్చర్స్ పైన ఇంట్రెస్ట్ పెరిగి అలా సినిమాల్లోకి వచ్చేశారు. అయితే, వడ్డే నవీన్ తండ్రి రమేశ్ నవీన్ ను సినిమాల్లోకి రావాలని ఫోర్స్ చేయలేదట. ఇకపోతే లవర్ బాయ్ ఇమేజ్ పాత్రలతో పాటు ఫ్యామిలీ సినిమాలు చేసి వడ్డే నవీన్ చక్కటి పేరు సంపాదించుకున్నారు. కానీ, ప్రజెంట్ ఆయన సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

వడ్డే నవీన్‌కు నందమూరి కుటుంబంతో బంధుత్వం ఉంది. వడ్డే నవీన్ నందమూరి వారి కుటుంబానికి అల్లుడు కావడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన నందమూరి రామకృష్ణ కూతురిని వడ్డె నవీన్ మ్యారేజ్ చేసుకున్నారు. అలా నందమూరి కుటుంబంతో వడ్డే నవీన్ కు బంధుత్వం ఏర్పడింది.

అలా వడ్డే నవీన్, జూనియర్ ఎన్టీఆర్ బావ, బావ మరుదులు అవుతారు. అయితే, వడ్డే నవీన్ పలు కారణాల రిత్యా తర్వాత కాలంలో నందమూరి రామకృష్ణ కూతురికి విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అలా నందమూరి వారి కుటుంబంతో వడ్డే నవీన్ బంధుత్వం తెగిపోయింది. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తో వడ్డే నవీన్ క్లోజ్ గా ఉంటారని వినికిడి.

Read more RELATED
Recommended to you

Exit mobile version