ఎర్రని పెదవుల కోసం ఇలా చెయ్యాల్సిందే…!

-

అందాన్ని రెట్టింపు చేస్తాయి ఎర్రటి పెదాలు. ఎవరైనా మొట్టమొదట మాట్లాడినప్పుడు గమనించేది పెదాలని. మరి ఆ పెదాలు నల్లగా ఉంటే నిజంగా నవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా….! కానీ ఇప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న టిప్స్ తో మీరు ఎంతో సులువుగా ఎర్రని పెదాలని పొందవచ్చు. మార్కెట్లో ఎన్నో రకాలైన క్రీమ్స్ ని ఉపయోగించాం కానీ సాధ్యం కాలేదు. దీని వల్ల ఏం వస్తుంది అని అనుకోకండి. నల్లటి పెదాలను ఎర్రగా మార్చే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని తప్పక పాటిస్తే అది సాధ్యం.

పెదాలు నల్లగా అసలు ఎందుకు మారిపోతాయి…? ఈ విషయం లోకి వస్తే… నాలుక తో పదేపదే తడపడం చేత కూడా పెదాలు నల్లగా మారుతాయి లేదా శరీరం లో సరైన పోషక విలువలు లేకపోవడం మూలాన కూడా రావచ్చు. అయితే ఎక్కువగా నీళ్ళు, కాయగూరలు, పండ్లు వంటివి మీరు తీసుకుంటూ ఉంటే విటమిన్లు శరీరానికి అందుతాయి. తద్వారా పెదాలు సహజ రంగు లో ఉండడానికి దోహదపడతాయి.

కలబంద గుజ్జును పెదాల చుట్టు రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. నిమ్మ రసం, తేనె కలిపిన పదార్థాన్ని పెదాలు చుట్టూ నల్లగా ఉన్న ప్రదేశం లో రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక చెంచా శనగ పిండి లో, ఒక చెంచా బాదం నూనె కలిపి మర్దన చేయడం వల్ల పెదాలు తేమను పీల్చుకుని పొడిబారకుండా అవుతాయి. కొబ్బరి నూనె, లిప్ బామ్, పాల మీగడ, వెన్న లాంటి పదార్థాలను రాయడం వల్ల నల్లటి పెదాలు ఎర్రగా మారుతాయి. ఈ టిప్స్ ని కనుక పాటిస్తే నల్లగా ఉన్న పెదాలు ఎంతో అందంగా మారిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news