వాస్తు: మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఇలా చెయ్యాల్సిందే..!

-

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వల్ల సమస్యలు లేకుండా ఉండొచ్చు. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా వాస్తు దోషాలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. కొత్త సంవత్సరం వస్తోంది కాబట్టి ఇప్పటివరకు కలిగిన బాధలు అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఆనందంగా ఒక కొత్త చాప్టర్ ని మొదలు పెట్టండి. ఇంట్లో ఈ వస్తువులు పెట్టుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి.

మెటల్ తాబేలు:

చాలామంది ఇళ్లల్లో తాబేలుని పెడుతూ ఉంటారు. కానీ చెక్కతో కానీ మట్టితో చేసినవి కానీ పెడుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఆనందం కలగాలంటే మెటల్ తో తయారుచేసిన తాబేలును పెట్టడం మంచిది. వెండి లేదా ఇత్తడి లేదా కంచు తాబేలుని పెట్టుకోవచ్చు. ఇది అదృష్టాన్ని తీసుకువస్తుంది.

వెండి ఏనుగు:

వెండి ఏనుగు శుభాన్ని కలిగిస్తుంది. అలానే వ్యాపారంలో కూడా లాభాలను తీసుకువస్తుంది ఆనందాన్ని, శాంతిని కూడా పెంపొందిస్తుంది.

నెమలీక:

నెమలీక కూడా ఇంటికి మంచిని తీసుకొస్తుంది. ఇంట్లో నెమలీకలు పెట్టడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. అలానే అదృష్టం వస్తుంది. కాబట్టి నెమలికని కూడా ఇళ్లల్లో పెట్టడం మంచిది.

చిలుక:

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కున చిలుక ఉంటే చాలా మంచిది. మీరు వీటిని ఇంట్లో పెట్టడం వల్ల చక్కగా మంచి కలుగుతుంది. అలానే అన్ని కలిసి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version