లోగోను మార్చిన ఈ-కామర్స్ సంస్థ మింత్రా.. అస‌లు ఏం జ‌రిగింది ?

-

అదేదో సామెత చెప్పిన‌ట్లు.. ప‌చ్చ కామెర్లు ఉన్న‌వాడికి లోకం అంతా పచ్చ‌గా క‌నిపిస్తుంద‌ట‌. అవును.. ఇప్పుడు ఈ-కామ‌ర్స్ సంస్థ మింత్రా లోగో విష‌యంలో కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎప్పుడూ దుర్బుద్ధితో ఆలోచించేవాడికి ఏం చూసినా, విన్నా బూతే క‌నిపిస్తుంది, బూతే వినిపిస్తుంది. చివ‌ర‌కు రామా అన్నా బూతు ప‌దం అలాగే వినిపిస్తుంది. మింత్రా లోగో అస‌భ్య‌క‌రంగా ఉంద‌ని చెప్పి ఫిర్యాదు చేస్తే దాన్ని ఆ కంపెనీ మార్చ‌క త‌ప్ప‌లేదు.

this is why myntra changed its logo

ముంబైకి చెందిన అవేస్టా ఫౌండేష‌న్ అనే ఓ ఎన్‌జీవోకు చెందిన కార్య‌క‌ర్త నాజ్ ప‌టేల్ గత డిసెంబ‌ర్ నెల‌లో మింత్రా సంస్థ‌పై ఫిర్యాదు చేసింది. ఆ సంస్థ‌కు చెందిన లోగో అస‌భ్య‌క‌రంగా ఉంద‌ని తెలిపింది. ఆ లోగో న‌గ్నంగా ఉన్న ఓ మ‌హిళ‌ను సూచిస్తుంద‌ని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొంది. క‌నుక ఆ లోగోను వెంట‌నే మార్చేలా చూడాల‌ని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మింత్రాను సంప్ర‌దించారు. అయితే వారు లోగోను మారుస్తామ‌ని, అందుకు ఒక నెల గ‌డువు ఇవ్వాల‌ని కోరారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు నెల గ‌డిచింది. దీంతో మింత్రా సంస్థ కొత్త లోగోను లాంచ్ చేసింది.

ఇక మింత్రాకు చెందిన కొత్త లోగోలో చిన్న‌పాటి చేంజ్ ఉంది. అంతే.. దీంతో నెటిజ‌న్లు మింత్రా సంస్థ‌ను, ఆ సంస్థ‌పై ఫిర్యాదు చేసిన వారిని ట్రోల్ చేస్తున్నారు. అస‌లు ఆ లోగోలో అస‌భ్య‌క‌రంగా ఏం ఉంది ? మాకు అయితే అందులో అస‌భ్య‌త ఏమీ క‌నిపించ‌డం లేదు ? బూతు మైండ్‌తో చూస్తే బూతులాగే క‌నిపిస్తుంది.. అంటూ చాలా మంది విమ‌ర్శిస్తున్నారు. ఇక మింత్రా లోగోను మార్చ‌డం వ‌ల్ల గూగుల్ కూడా ఇప్పుడు జీమెయిల్‌కు కొత్త లోగోను పెట్టుకుంటే బెట‌ర్ అని కొంద‌రు కామెంట్లు పెట్టారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news