తాజాగా పేపర్లు, చెప్పులు క్యూకట్టడం సూర్యాపేట గిరినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వెలుగులోకి వచ్చింది. కరోనా టెస్టులు, వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు. కోవిడ్ భయంతో ఆధార్ కార్డుల జిరాక్స్ పేపర్లు, చెప్పులు, రాళ్లు క్యూలైన్‌లో ఉంచారు. అయితే ఇక్కడి నుంచి కరోనా వ్యాప్తి చెందుతోందని జనాలు అంటున్నారు. కరోనా నిబంధనలు అస్సలు పాటించడంలేదని చెబుతున్నారు. స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ వ్యాక్సిన్, టెస్టులు చాలా ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెస్టులు, వ్యాక్సిన్లు పరిమితంగా కాకుండా ఎక్కువ సంఖ్యలో చేయాలని పేర్కొంటున్నారు.
ఈ క్యూ లైన్ సినిమా, రేషన్, మంచినీళ్ల కోసం కాదు!
-