ఇలా ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా రూ.3 వేలు వస్తాయి..!

-

ప్రతీ నెల మీరు మూడు వేల రూపాయలని పొందాలని అనుకుంటున్నారా…? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ స్కీమ్ లో చేరడం వలన ప్రతి నెలా రూ.3,000 వస్తాయి. అయితే దీనికి రూ.55 నుంచి చెల్లించాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది.

అయితే వీటిల్లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి. మీరు కనుక ఈ పథకం లో చేరారు అంటే ప్రతి నెలా మీరు డబ్బులు పొందొచ్చు. అసంఘటిత రంగానికి చెందిన వారు ఈ పథకం లో చేరొచ్చు. ఆసక్తి వున్న వాళ్లు సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం లో చేరొచ్చు.

దీని కోసం ఆధార్ కార్డు, జన్ ధన్ అకౌంట్ ఉంటే సరి పోతుంది. పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అవసరం. నామినీ సదుపాయం ఉంటుంది. మీరు స్కీమ్‌ లో చేరిన తర్వాత మీకు శ్రమ్ యోగి కార్డు ఇస్తారు. ఇలా ఈ స్కీమ్ ద్వారా మీరు ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఇది ఇలా ఉంటే.. ఈ పథకం లో కనుక మీరు చేరాలి అంటే తప్పక మీ వయస్సు 18 నుండి 40 ఏళ్లు మధ్య ఉండాలి.

రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడకూడదని అనుకుంటే కూడా ఈ పథకం లో చేరొచ్చు. దీని వలన మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ఆర్ధికంగా కూడా ఇబ్బందులు వుండవు. నెలకు రూ.55 నుంచి రూ.200 కట్టాలి. మీ వయసు ప్రాతిపదికన మీకు వచ్చే పెన్షన్ డబ్బులు మారుతూ ఉంటాయి. శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం లో చేరిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా డబ్బులు వస్తాయి ఇది గమనించండి. ఈ పధకం ద్వారా నెలకు రూ.3 వేలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version