రాజేందర్ గెలుపు కోసం ఆ ఎమ్మెల్యే వ్యూహాలు..

-

దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు ఎదురు నిలిచి గెలుపు రుచి చూసిన రఘునందన్ రావు గురించి తెలంగాణ రాజకీయాల్లో తెలియని వారుండరు. టీఆర్ఎస్ నాయకులపై ఎప్పుడూ ఆరోపణలు చేసే ఈ నేత అంటే వారు కూడా కాస్త ఆలోచిస్తారు. అటువంటి రఘునందన్ రావు హుజురాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి కాషాయ కండువా కప్పుకున్న ఈటల రాజేందర్ గెలుపు కోసం అనేక వ్యూహాలు రచిస్తున్నాడు. కానీ దుబ్బాకలో లాగ ఇక్కడ రఘునందన్ రావు పాచిక ఇక్కడ పారదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పరిశీలించి చూసినా.. కూడా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కేవలం ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు కు మాత్రమే బాధ్యతలు అప్పగించారు. కానీ హుజురాబాద్ కి వచ్చే సరికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలకు ఇన్ చార్జులను నియమించి వారిని స్థానికంగా నే ఉండేలా వ్యూహాలు రచించారు.

 

ప్రస్తుతం బీజేపీ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా రఘునందన్ రావు రాజకీయ ఓనమాలు నేర్చింది టీఆర్ఎస్ పార్టీలోనే. తర్వాత జరిగిన కొన్ని ఘటనల వల్ల ఆయన కారు దిగి కమలం పార్టీలో చేరారు. కాబట్టి ఈటల రాజేందర్ కు రఘునందన్ రావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉద్యమ కాలం నుంచే వీరివురూ.. దగ్గరి వారట. అంతే కాకుండా రఘునందన్ రావు టీఆర్ఎస్ లో ఉన్న కాలంలో ఈటల రాజేందర్ సాయం చేసినట్లు చెబుతారు.

అలాంటి ఈటల రాజేందర్ గెలుపు కోసం ప్రస్తుతం రఘునందన్ రావు అనేక వ్యూహాలు రచిస్తున్నాడట. ఎలాగైనా ఈటలను గెలిపించాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అంతే కాకుండా ఈటల రాజేందర్ బహిరంగ సభల్లో రఘునందన్ రావు ఖచ్చితంగా దర్శనమిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version