ఏడు కోట్ల కంటే ఎక్కువ ఆస్తులున్న కుటుంబాల్లో టాప్ టెన్ లో తెలుగు రాష్ట్రాలు..

-

హురున్ ఇండియావెల్త్ 2020రిపోర్ట్ ప్రకారం ఇండియాలో కనీసం 7కోట్ల ఆస్తులున్న కుటుంబాల లెక్కలు బయటకు వచ్చాయి. 4.12లక్షల కుటుంబాలు కనీసం 7కోట్ల ఆస్తులని కలిగి ఉన్నాయట. మొత్తం దేశవ్యాప్తంగా చేసిన ఈ సర్వేలో ఎక్కువ శాతం కుటుంబాలు దేశంలోని ధనిక రాష్ట్రాల్లోనే ఉండడం విశేషం. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా, రెండవ స్థానంలో ఢిల్లీ ఉంది. మహారాష్ట్రలో ఉన్న 56వేల కుటుంబాల్లో 16,933వేల కుటుంబాలు ముంబైలోనే ఉన్నారు.

ఢిల్లీలో 16వేల కుటుంబాలు, కోల్ కతాలో పదివేళు, బెంగళూరు 7వేలు, చెన్నై 4500కుటుంబాలు ఉన్నాయి. ఏడుకోట్ల ఆస్తులున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కింది. అంటే, తెలుగు రాష్ట్రాల్లోనూ ఏడు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు అధికంగానే ఉన్నట్లు అర్థం అవుతుంది. హురూన్ సర్వే మధ్యతరగతి లెక్కలు కూడా కనుక్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version