ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానంటూ బెదిరింపు కాల్…

-

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా ఒక బెదిరింపు కాల్ వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం నిన్న రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుండి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశారు. ఈ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ప్రధాని మోదీని చంపేస్తానని బెదిరించి కాల్ కట్ చేశాడు. ఈ వార్నింగ్ కాల్ ను సీరియస్ గా తీసుకున్న పోలీస్ ల బృందం రంగంలోకి దిగి ట్రేస్ చేయాలా ఆ ఫోన్ నెంబర్ ఢిల్లీకి చెందిన హేమంత్ కుమార్ గా గుర్తించారు. కాగా ఇతని వ్యక్తిగత వివరాలను పరిశీలిస్తే హేమంత్ కుమార్ ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడని తెలుస్తోంది, పైగా కొంతకాలంగా ఉద్యోగం లేక మద్యానికి బానిస అయ్యాడట. ప్రధాని నరేంద్ర మోదీ అర్హతకు తగిన ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడన్న కారణంతో మనస్తాపం చెంది ఇలా చేసి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

ఈయన ఎక్కడ ఉన్నదో గుర్తించి వెంటనే అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే అతని కాల్ చేయడం వనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది పోలీసులు విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news