ఒకే కుటుంబంలోని ఐదుగురి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ – అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మియాపూర్ లో ఈ ఘటన తెరపైకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.

మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉండగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనాస్థలికి చేరుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు… చుట్టూ పక్కల వాళ్ళను విచారిస్తున్నారు. మృతులది కర్ణాటక రాష్ట్రంగా గుర్తించారు పోలీసులు. ఇక ఒకే కుటుంబంలోని ఐదుగురి మృతి చెందిన సంఘటన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.