బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

-

బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఉదయం సల్మాన్‌ను చంపేస్తామని మరో బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఈ కాల్‌ వచ్చినట్లు గుర్తించారు. రూ.2 కోట్లు చెల్లించాలని, లేనియెడల సల్మాన్‌ను చంపేస్తామని సదరు వ్యక్తి బెదిరించినట్లు తెలిసింది. ఈ కాల్ నేరుగా సల్మాన్ కుటుంబానికి కాకుండా ముంబై ట్రాఫిక్ పోలీసులకు వచ్చినట్లు సమాచారం.

బెదిరింపు కాల్ రావడంతో ముంబైలోని వర్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలాఉండగా, గతంలో సల్మాన్ ఖాన్ ను బెదిరించిన నోయిడాకు చెందిన 20 ఏళ్ల మహ్మద్ తయ్యబ్ అనే వ్యక్తిని మంగళవారం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. తయ్యుబ్ గతంలో సల్మాన్ ఖాన్, దివంగత మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కొడుకు జిషాన్ సిద్ధిఖీలను బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version