ఫ్రీ బస్ ఎక్కి ఎంచక్కా చక్కర్లు.. అదృశ్యమైన ముగ్గురు బాలికలు దొరికారు

-

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుంచి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పాఠశాలకు వెళ్తున్నామని చెప్పిన విద్యార్థినీలు డుమ్మా కొట్టి ఆర్టీసీ బస్సులో ఎంచక్కా షికార్లు కొట్టినట్లు తెలిసింది. ఎలాగూ ఫ్రీ ఆర్టీసీ బస్ కావడంతో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ వరకు విద్యార్థినులు వెళ్లినట్లు సమాచారం.

తమ పిల్లలు కనిపించడం లేదని బాధిత పేరెంట్స్ ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థినులను పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. ముగ్గురు విద్యార్థినీలు ముందుగా ప్లాన్ చేసుకుని బస్సులో తిరిగినట్లు పోలీసులు నిర్దారించారు. మొత్తానికి కనిపించకుండా పోయిన బాలికలు దొరకడంతో పేరెంట్స్ ఊపిరిపీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version