Notices issued to former minister Talasani Srinivas Yadav: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్ ఖాళీ చేయాలని నోటీసులు అందాయి. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న ఉన్న వాళ్ళు ఖాళీ చేయాలంటూ నోటిసులు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్.
ఈ తరుణంలోనే… మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ లెక్కన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఖాళీ చేయాల్సి ఉంటుంది అని చెబుతున్నారు. ఇక తనకు నోటీసులు ఇచ్చిన అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా స్పందించలేదు.