ఈ రోజుల్లో ఉద్యోగాల వలన మరియు ఇతర కారణాల వలన ఎంతో బిజీగా మారుతున్నారు. దీని వల్ల ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం లేదు. దీని వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంత సమయం బయటకు వెళ్లి వచ్చినప్పుడు తలనొప్పి వంటి సమస్యలు వంటివి ఎదురవుతున్నాయి. ఎప్పుడైతే ఒత్తిడి వలన తలనొప్పిని ఎదుర్కొంటారో, అది కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. కాకపోతే మంచినీరు మరియు ఇతర పానీయాలను తీసుకోవడం, కొద్ది సమయం నిద్రపోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం వలన సాధారణమైన తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
అయితే, తీవ్రమైన తలనొప్పి ఎదురైతే దానిని సాధారణంగా తీసుకొని వదిలేస్తే పొరపాట్లు చేసినట్టే. కొంత శాతం మంది మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. మరికొందరు ఇతర అనారోగ్య సమస్యల వలన తలనొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిశోధన ప్రకారం, ఎవరైతే రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారో వారు కూడా తలనొప్పిని ఎదుర్కొంటారని చెబుతున్నారు.సాధారణంగా ఒత్తిడి వల్ల తలనొప్పి వస్తే కొంత సమయానికి తగ్గిపోతుంది. కాకపోతే, రక్తపోటు వల్ల వచ్చే తలనొప్పి ఆకస్మాత్తుగా వస్తూ ఉంటే దీని తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
తలనొప్పితో పాటు తల తిరగడం, వికారం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇటువంటి లక్షణాలను ఎదుర్కొన్నప్పుడు, సాధారణమైన మాత్రలు వేసుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ లక్షణాలతో పాటు ముక్కు నుంచి రక్తం రావడం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జరగడం వంటి లక్షణాలు కూడా రక్తపోటుకు సంకేతాలు. ముఖ్యంగా, ఎవరైతే తలనొప్పితో పాటు చూపు మసకబారడం లేదా కంటి చూపుకు సంబంధించిన ఇతర సమస్యలను ఎదుర్కొంటారో అవి రక్తపోటుకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. దీనివలన ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందో కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.