టీమిండియా మాజీ కెప్టెన్, తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్ త్వరలో తెరాసలో చేరుతున్నారన్న ప్రచారంపై ..ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ‘నేను తెరాస పార్టీలో చేరబోతున్నానంటూ తెలంగాణలో కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అదంతా అబద్ధం’ అని అజారుద్దీన్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అజారుద్దీన్ 2009లో ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత ఎన్నికలు 2014లో ఓటమి పాలయ్యారు. గత కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
తన చరిస్మాకు తగ్గట్లుగానే పార్టీలో సరైన ప్రాధాన్యాన్ని కల్పించి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ పదోన్నతి కల్పించారు. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాసపై అజారుద్దీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన తెరాసలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నియంత్రించే విధంగా ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తెరాస తరుఫున సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారన్న పుకార్లు చక్కర్లు కొట్టాయి.