గత ప్రభుత్వంలో తెలంగాణ రాజకీయాలను టీఆర్ఎస్ ఒంటి చేతితో శాసించింది. అప్పటి పరిస్థితులను బట్టి చూస్తుంటే భవిష్యత్ అంతా టీఆర్ఎస్ పార్టీదే అన్నట్టు సాగింది. అసలు ఆ పార్టీకి ఎదుర్కునే నాయకుడు ఉన్నారా అనే రేంజ్ హవా సాగించింది. ఇక అప్పటికి తెలంగాణలో బీజేపీ హవా పెద్దగా లేదు. ఇక ఉనికిలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకని నిర్వీర్యం చేశారు. ఇంకేముంది అసలు టీఆర్ఎస్‌కు ఎదురు లేదని అంతా భావించారు. కానీ ఇలాంటి సమయంలో ఇప్పుడు బండి సంజయ్, రేవంత్ రూపంలో కొత్త ప్రత్యర్థులు వచ్చారు.
ఇక పోతే కాంగ్రెస్ నిర్వీర్యం అవుతున్న సమయంలో రేవంత్ పగ్గాలు చేపట్టారు. ఆయన వస్తూనే పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఇక ఆయనకు మొదటి నుంచి మంచి మాటకారిగా పేరు ఉండటంతో పాటు మాటలతోనే ప్రజలను ఆకట్టుకోగలరు. అలాగే మరీ ముఖ్యంగా యూత్ లో కూడా రేవంత్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆయన రాబోయే కాలంలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా మారే అవకాశం ఉంది. ఇక అధికార టీఆర్ ఎస్ పార్టీని నడిపిస్తున్న కేటీఆర్ విషయానికి వస్తే ఆయనకు కూడా జనాల్లో మంచి క్రేజ్ ఉంది. యూత్ లోకూడా బాగానే ఫాలోయింగ్ ఉంది. భావి సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఈ ముగ్గురే శాసిస్తున్నారు. మరి ఇదే హవా కొనసాగిస్తే గనక ఈ ముగ్గురి మద్యే రాబోయే కాలంలో టఫ్ ఫైట్ ఉంటుంది. చూడాలి మరి ఎవరికి ఎలాంటి భవిష్యత్ ఉంటుందో.