వికారాబాద్‌లో రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి…!

-

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు రైల్వే ఉద్యోగులు మరణించినట్లు సమాచారం. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మూసీ నది పై ఉన్న రైల్వే బ్రిడ్జి పై మొత్తం 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేపడుతున్నారు. ఈ సమయంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.

vikarabad-train-accident

హైదరాబాదు నుండి వికారాబాద్ కు వెళుతున్న రైలు ఇంజన్ గుద్దడం తో అక్కడే పనిచేస్తున్న 12 మంది రైల్వే ఉద్యోగులలో ముగ్గురు మృతి చెందారు. ఇక మరణించిన వారిని ప్రతాప్ రెడ్డి, నవీన్, షంషేర్ అలీ లుగా గుర్తించారు. ఈ సంఘటనపై రైల్వే శాఖ పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నారు. ఘటన స్థలాన్ని రైల్వే ఉన్నతాధికారులు, వికారాబాద్ జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఇది పూర్తిగా రైల్వే అధికారుల నిర్లక్ష్యమం అని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మూర్తి చెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని తోటి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version