నిమ్మగడ్డకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు…?

-

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిరిగి ఎన్నికల కమీషనర్ గా నియమించాలి అని, ఆయనను కొనసాగించాలి అంటూ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్ ఇచ్చిన లేఖను తాము గౌరవిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కమీషనర్ వ్యవహారం సుప్రీం కోర్ట్ లో నడుస్తూనే ఉందని ఆయన అన్నారు. నిమ్మగడ్డ లక్షలు లక్షలు పెట్టి లాయర్లను పెట్టుకున్నారని, ఆయనకు డబ్బులు ఎవరు ఇస్తున్నారని…? చంద్రబాబు ఇస్తున్నారా అంటూ నిలదీశారు.

నిమిషానికి లక్షలు లక్షలు తీసుకునే లాయర్లను పెట్టుకున్నారు అని  ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి అలవాటు పడ్డారు అని ఆయన మండిపడ్డారు. నిమ్మగడ్డ ఎన్నికల కమీషనర్ గా శాస్వతంగా ఉండాలి అని టీడీపీ భావిస్తుందని ఆయన ఆరోపించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయం సుప్రీం కోర్ట్ లో ఉంది కాబ్బట్టి ఎం జరుగుతుందో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరు స్పాన్సర్ చేస్తే లాయర్లను పెట్టుకున్నారని ఆయన నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version