సభ్యత, సంస్కారాలకు పెట్టింది పేరయిన మన దేశంలో యువత పెడధోరణులు రోజురోజుకు హద్దులుదాటున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలకు సరైన రక్షణ కల్పించలేకపోతున్నామని ఒక వైపు ప్రభుత్వాలు, మేధావి వర్గాలు తర్జనభర్జనలు పడుతుంటే.. మరోవైపు బరితెగించిన కొందరు యువతులు మహిళలకు తలవంపులు తెచ్చే పనిచేశారు. బెంగళూరులో అర్ధరాత్రి పూట ఓ యువకుడిని అడ్డగించి ‘రాత్రంతా కంపెనీ ఇస్తాం వస్తావా’ అని అడిగారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకేరె పట్టణానికి చెందిన ప్రజ్వల్ అనే 18 ఏండ్ల యువకుడు.. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 12.30 గంటలకు బెంగళూరు సిటీలో కేఎస్‌ఆర్టీసీ బస్సు దిగాడు. అక్కడి నుంచి మైసూరు రోడ్డులోని తన గదికి వెళ్లడం కోసం లోకల్ బస్‌స్టాండు వైపు నడుస్తున్నాడు. ఇంతలో ముగ్గురు యువతులు వచ్చి అతడిని అడ్డగించారు. ‘రాత్రంతా కంపెనీ ఇస్తాం.. వస్తావా’ అని అడిగారు. ఏకంగా ముగ్గురు యువతులు ఒకేసారి వచ్చి అలాంటి ఆఫర్ ఇవ్వడంతో ఖంగుతిన్న ప్రజ్వల్ నో చెప్పాడు.
దీంతో ఆ యువతులు గేరు మార్చారు. ‘నువ్వు రాత్రంతా మాతో గడుపుతావా..? లేదంటే నీ జేబులో ఉన్న డబ్బులు మొత్తం ఇస్తావా..’ అని మెలికపెట్టారు. అయితే, ప్రజ్వల్ ఆ రెండింటికి ఒప్పుకోకపోవడంతో.. తమను అల్లరి చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, అరిచి గోల చేస్తామని బెదిరించారు. దాంతో బెదిరిపోయిన యువకుడు తన బేబులోని రూ.4000 ఇచ్చి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత ఉప్పర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.