చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ని టిక్ టాక్ ప్రచారం చేస్తుందని, కరోనా వ్యాప్తి విషయంలో ఈ యాప్ సహకారం అందిస్తుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. కొంత మంది టిక్ టాక్ లో కరోనా వైరస్ ని పూర్తి స్థాయిలో వ్యాప్తి చెయ్యాలని సూచనలు చేస్తున్నారు. దీనిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉన్నాయి. దీన్ని కట్టడి చెయ్యాలని కోరుతున్నారు.
అయితే మన దేశానికి టిక్ టాక్ వంద కోట్ల భారీ సాయం చేసింది. వైద్యుల భద్రతకు తన వంతుగా సహాయం చేసింది. కాని కరోనా వైరస్ వ్యాప్తిని పెంచే సూచనలను మాత్రం ఆ యాప్ బ్యాన్ చేయడంలో ఆలోచిస్తుంది. అంటే దీని వెనుక చైనా కుట్ర ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనితో కేంద్రానికి సూచనలు చేస్తున్నారు. టిక్ టాక్ ని మన దేశంలో బాన్ చెయ్యాలి అని సూచించారు. అటు కేంద్ర సమాచార శాఖ కూడా ఈ విషయంలో చాలా వరకు సీరియస్ గానే ఉంది.
ఇక జూమ్ యాప్ విషయంలో కూడా కేంద్రం ఆగ్రహంగా ఉంది. సమాచారాన్ని అది సేకరిస్తుందని, యాప్ వాడే వారి డేటా మొత్తం చైనా చేతుల్లో పెడుతుంది అంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ రెండు యాప్స్ ని పూర్తి స్థాయిలో బాన్ చేసే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉంది. కేబినేట్ సమావేశంలో దీని గురించి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే వీటి బ్యాన్ ఉంటుంది అంటున్నారు. మోడీ ఈ విషయమై కేంద్ర సమాచార శాఖతో పూర్తి సమాచారం తెప్పించుకున్నారని అంటున్నారు.