అసలే కరోనా దెబ్బకు జనాలు హడలిపోతుంటే డ్రాగన్ దేశం చైనాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వైరస్‌లు, వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. కరోనా అక్కడే పుట్టింది. తరువాత మరో రెండు వైరస్‌లను ఇటీవలే అక్కడ కనుగొన్నారు. ఇక ఇప్పుడు పురుగుల ద్వారా మరొక వ్యాధి వస్తుందని నిర్దారించారు. చైనా ప్రభుత్వమే ఈ విషయాన్ని అక్కడ అధికారికంగా ప్రకటించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీ నుంచి చైనాలో కొత్తగా ఓ ఇన్‌ఫెక్షియస్ వ్యాధి వస్తుందని గుర్తించారు. ఈ వ్యాధి పురుగులు కుట్టడం వల్ల వస్తుందని తేల్చారు. ఈ క్రమంలో దీని వల్ల ఇప్పటి వరకు 5 మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు. పురుగులు కుట్టడం వల్ల వచ్చే ఆ వ్యాధిని Thrombocytopenia Syndrome (SFTS) గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాధి బారిన పడ్డవారికి తీవ్రమైన జ్వరం వస్తుంది. చైనా ఆరోగ్యశాఖ అధికారులు ఈ వ్యాధిపై అధికారిక ప్రకటన చేశారు.
చైనాలోని అన్‌హుయ్ ప్రావిన్స్‌లోనే ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు గుర్తించారు. అయితే ఇది ఎందుకు వస్తుంది, వచ్చాక ఇంకా ఇతర లక్షణాలు ఏం కనిపిస్తాయి, ఏ మేర ప్రమాదకరం.. తదితర అనేక విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా.. చైనా మాత్రం కొత్త కొత్త వ్యాధులు, వైరస్‌లతో ప్రపంచ దేశాలను ఇంకా భయపెడుతూనే ఉంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.