అక్టోబర్ 15న ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్

-

మాస్ మహారాజా రవితేజ హీరోగా రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురంలో గజదొంగగా పేర్గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. కొత్త దర్శకుడు వంశీ ఈ సినిమా తెరకెక్కుస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Tiger Nageswara Rao pre-release event on October 15
Tiger Nageswara Rao pre-release event on October 15

అయితే..రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 15న హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అక్టోబర్ 3న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుందని తెలిపింది. మరో 20 రోజుల్లో టైగర్ వేట ప్రారంభం కానుందని ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించగా, జీవి ప్రకాష్ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news