టైగర్ నాగేశ్వరరావు: హాట్ టాపిక్ గా మారిన రేణు దేశాయ్ క్యారెక్టర్..!

-

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలోనే టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు అని.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాదిలో టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో ఆమె పాత్ర కొద్ది సమయం మాత్రమే ఉందని చాలామంది భావిస్తున్నారు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా 100 నిమిషాలు నిడివి ఆమె స్క్రీన్ టైం అని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

రవితేజతో కాంబో సన్నివేశాలు సినిమాలో చాలా స్పెషల్ గా ఉంటాయట. అంతేకాకుండా రవితేజ మరియు రేణూ దేశాయ్ ల మధ్య ఉండే కొన్ని సెంటిమెంటు సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అని కూడా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమాలో ఎక్కువ నిడివి పాత్రను రేణు దేశాయ్ చేస్తున్న నేపథ్యంలో ఆమె అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. నటిగా చాలా సంవత్సరాలుగా రేణూ దేశాయ్ ప్రేక్షకులు వెండితెరపై చూడాలని ఆశ పడుతున్నారు.

అప్పట్లో జానీ సినిమా చేసి మళ్లీ కనిపించలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మరియు బుల్లితెరపై కూడా పలు సందడి చేస్తోంది. హీరోయిన్ గా గతంలో చేసిన రేణు దేశాయికి టైగర్ నాగేశ్వరరావు సెకండ్ ఇన్నింగ్స్ అవుతోంది. ఈ సినిమా హిట్ అయిన తరువాత పాత్ర విషయంలో మంచి పేరు వస్తే కచ్చితంగా ముందు ముందు మరిన్ని సినిమాల్లో కూడా రేణు దేశాయ్ నటించే అవకాశాలు ఉన్నాయి….

Read more RELATED
Recommended to you

Latest news