ఆహారం లేక ప్లాస్టిక్ తింటున్న పులులు…!

-

ఉత్తరాఖండ్ లోని కార్బెట్ టైగర్ రిజర్వ్ లో మూడు పులులు ప్లాస్టిక్ తినడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ధికాలా మండలంలోని రామ్ గంగా నదిలో ఒక ప్లాస్టిక్ కంటైనర్ మీద మూడు పులులు ప్లాస్టిక్ తింటూ కనిపించాయి. దీనికి సంబంధించిన ఫోటోలను ఒక పర్యాటకుడు అధికారులకు ఇచ్చాడు. ఈ ఈ నది చమోలి జిల్లాలోని గైర్సేన్ నుండి నైనిటాల్ జిల్లాలోని రామ్‌నగర్ వరకు ప్రవహిస్తుందని సిటిఆర్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ జోషి మీడియాకు వివరించారు.

ఆ ప్రాంతాన్ని అడవి జంతువులకు రక్షిత ప్రాంతంగా అధికారులు గతంలోనే గుర్తించారు. అదే విధంగా అక్కడ ప్లాస్టిక్ ని కూడా నిషేధించారు కూడా. ఈ విషయాన్ని కొన్ని ఫోటోల ద్వారా అధికారులు గుర్తించారు. సిటిఆర్‌లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉన్నందున, ఆ ప్లాస్టిక్ అక్కడికి ఏ విధంగా వచ్చింది అనేది అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనితో ఇప్పుడు అక్కడ జంతువుల రక్షణపై అనేక ప్రశ్నలు వినపడుతున్నాయి.

ఆ నది ఒడ్డున అనేక గ్రామాలు ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్ను అక్కడ ఉండే గ్రామస్తులు ఎవరైనా పడేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్‌ను ఈ విషయంపై ప్రశ్నించగా దీనిపై దర్యాప్తుకి ఆదేశించామని చెప్పారు. అయితే కొండ వాలు ప్రాంతం కావడంతో నదిలో నుంచి ఏమైనా ప్లాస్టిక్ కొట్టుకు వచ్చిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే వాటికి ఆహారం లేక ప్లాస్టిక్ తింటున్నట్టు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news