ఢిల్లీలోని తీహార్ జైలులో ఖైదీలు దెయ్యాలను చూసామని చెబుతున్నారు. అక్కడ చనిపోయిన పాత ఖైదీళు ఆత్మలుగా మారి తమని భయపెడుతున్నారని అంటున్నారు. వివరాల్లోకి వెళితే, హార్ష్.. ఇప్పటికి మూడుసార్లు తీహార్ జైలు వెళ్ళి వచ్చాడు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకి వచ్చిన ఈ ఖైదీ, దెయ్యాల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అర్థరాత్రి 2గంటలు దాటిన తర్వాత తన గదిలో వింత వింత శబ్దాలు వచ్చేవని, ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే కిటికీ రెక్కల మీద ఎవరో వేలాడుతున్నట్టుగా కనిపించేదని అన్నాడు.
తీహార్ జైలులో దెయ్యాలు, ఆత్మల గొడవ ఇప్పటిది కాదు. ఇప్పటి వరకు అక్కడ 32మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. వాళ్ళే ఇలా ఆత్మల రూపంలో వస్తుంటారని కొందరి వాదన. రాత్రి పడుకునే ముందు దేవుడికి ప్రార్థన చేసి పడుకుంటానని, కొద్దిసేపటి తర్వాత తన పక్కన ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుందని, అది ఖచ్చితంగా ఆత్మే అయ్యుంటుందని హార్ష్ అన్నాడు. కళ్ళు తెరిచి చూస్తే కిటికీ రెక్క మీద వేలాడుతున్నట్టుగా ఉండేదని చెప్పాడు.
కన్ఫెషన్స్ ఆఫ్ తీహార్ జైల్ అనే పుస్తకంలో ఒక అధ్యాయంలో దెయ్యాల గురించే రాసారు. అక్కడ ఖైదీలు చెప్పిన దాని ప్రకారం కాశ్మీర్ ని విడగొట్టాలని చూసిన ఆఫ్జల్ గురు ఆత్మ ఎక్కువగా కనిపించేదట.
13సార్లు తీహార్ జైలుకి వెళ్ళివచ్చిన అశోక్ బాజీ చెప్పిన దాని ప్రకారం, వైద్య విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన వారి ఆత్మలు తనకు కనిపించాయని, వారికి ఉరిశిక్ష పడ్డ తర్వాత వారం రోజులు జైలులో గడిపినపుడు ఒకసారి అర్థరాతి తన ఛాతీమీద ఏదో బరువుగా అనిపించిందన్ కళ్ళు తెరిచి చూస్తే, ఆ నలుగురిలో ఒకడు( ముకేష్ సింగ్ ) కనిపించాడని అన్నాడు. అప్పుడు భయపడి బిగ్గరగా అరిచేసరి అది మాయమైందని చెప్పుకొచ్చాడు.
తెల్లవారాక మిగతా ఖైదీలు కూడా ఇదే విషయం చెప్పారని అన్నాడు. ఖైదీలు ఇలాంటివి అనుభవం చేసినపుడు కౌన్సిలింగ్ ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆసియాలోని అతిపెద్ద జైలులో ఆత్మల కథలు చాలానే ఉన్నాయి.