భారీ ధరకు టిల్లు స్క్వేర్ ని కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ..!

-

డీజే టిల్లు సినిమా సక్సెస్ అయిన తర్వాత డీజే టిల్లు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఆ సినిమా తో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించేసారు సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు మరోసారి నవ్వించడానికి టిల్లు స్క్వేర్ తో రాబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ గ్లిమ్ప్స్ కి కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది సిద్దు జొన్నగడ్డతో లిప్ లాక్ సీన్లతో అనుపమ కనపడ్డారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఓటీటీ డీల్ కోసం అమెజాన్ నెట్ ఫ్లిక్స్ సోనీ లీవ్ పోటీపడ్డారు లాస్ట్ కి అధిక మొత్తానికి నెట్ ఫ్లిక్స్ సినిమాను సొంతం చేసుకుంది యూత్ ని ఆకట్టుకునే రొమాంటిక్ ఫిలిం డిజిటల్ హక్కులని దాదాపు 35 కోట్లకి కొనుగోలు చేసింది అని తెలుస్తోంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 29 థియేటర్లలో రిలీజ్ అవ్వబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news