బొద్దింకలతో విసిగిపోయారా..? అయితే ఈ చిట్కాలు బెస్ట్..!

-

చాలా మంది బొద్దింకల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు ఆహారపదార్థాలు మీదకు కూడా వచ్చేస్తూ ఉంటాయి. బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. దీనితో ఇంట్లో నుంచి బొద్దింకలను తరిమికొట్టొచ్చు.

బేకింగ్ సోడా షుగర్:

కొద్దిగా పంచదార తీసుకుని అందులో బేకింగ్ సోడా కలిపి బొద్దింకలు తిరిగే చోట జల్లండి ఇలా చేయడం వల్ల బొద్దింకలు చనిపోతాయి.

బిర్యానీ ఆకు పొడి:

బొద్దింకలు తిరిగే చోట బిర్యానీ ఆకు పొడిని జల్లండి ఇలా చేయడం వల్ల ఆ వాసనని బొద్దింకలు భరించలేక చనిపోతాయి.

సోప్ వాటర్:

సోప్ వాటర్ స్ప్రే చేయడం వలన కూడా ఇవి చనిపోతాయి మీరు కొంచెం సబ్బు తీసుకుని అందులో నీళ్లు కలిపి దీనిని జల్లండి.

బోరిక్ పౌడర్:

బోరిక్ పౌడర్ లో షుగర్, గోధుమపిండి వేసి బాల్స్ లాగా చేయండి ఈ బాల్స్ ని బొద్దికాలు తిరిగే చోట పెట్టండి ఇలా చేయడం వల్ల అవి కనపడవు.

దోసకాయ ముక్కలు:

దోసకాయ ముక్కలు కట్ చేసి ఎండబెట్టి ఆ ముక్కలను అల్మరా లో పెడితే బొద్దింకలు రావు.

అమ్మోనియం:

బొద్దింకల కి అమ్మోనియం అంటే అస్సలు నచ్చదు బకెట్ నీళ్ళలో అమ్మోనియం కలపండి. ఆ వాటర్ ని బాత్రూం లో వంట గది లో స్ప్రే చేయండి. ఇలా చేయడం వలన కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. బొద్దింకల తో మీరు విసిగిపోయినట్లయితే ఈ టిప్స్ ని అనుసరించండి దానితో సమస్యలే వుండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version