లావుగా ఉన్న బిడ్డని కావాలనుకుంటున్నారా….? అయితే ఈ మార్పులు చెయ్యాల్సిందే…!

-

గర్భధారణ సమయంలో మహిళలు, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇద్దరికీ కూడా
ఖచ్చితంగా సమతుల్య ఆహారం అవసరం. కనుక మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు విటమిన్లు మరియు ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు చాల అవసరం. కాబట్టి వీటిపై కూడా తప్పక శ్రద్ద పెట్టాలి. అయితే బలంగా, లావుగా ఉన్న బిడ్డను మీరు కోరుకున్నట్లయితే తప్పక ఈ పద్ధతిని అనుసరించండి.

కొన్ని పోషకాలు మీకు మరియు మీ బిడ్డకు శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి మరియు ఎటువంటి సమస్యలు లేకుండా గర్భధారణను సంతోషకరమైన క్షణం చేస్తాయి. మీ శిశువు నాడి, మెదడు మరియు వెన్ను అభివృద్ధికి ఫోలిక్ ఆమ్లం చాలా ముఖ్యం. 500 మైక్రోగ్రాముల వరకు పట్టవచ్చు. దీని వల్ల శిశువు బరువును పెరుగుతుంది. అలానే హోమోగ్లోబిన్ సమస్యలను నివారించడానికి మరియు ముందస్తు ప్రసవాలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలానే మీ శిశువు అభివృద్ధికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ప్రోటీన్స్ ని తీసుకోవడం వల్ల శిశువు రక్తం, ఎముకలు, అవయవాలు, కండరాలు మరియు కణజాలాలను పెరగడానికి సహాయపడుతుంది. తగినన్ని మాత్రమే తీసుకోండి అతిగా కాదు.

హీమోగ్లోబిన్ కోసం ఇనుము అవసరం. శిశువు పెరిగేకొద్దీ శిశువు మరియు తల్లికి తగినంత ఇనుము ఉండాలి. ఇది కనుక లేకపోతే పుట్టబోయే బిడ్డకు రక్తహీనత, బరువు తగ్గడం, గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. రోజుకు 35 మిల్లీగ్రాముల ఇనుము అవసరం మహిళలకి. గూస్బెర్రీస్, నిమ్మకాయలు మరియు టమోటాలు వంటి విటమిన్ సి మొదలైన వాటిల్లో ఐరన్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version