ముక్కు, ముఖంపై నల్లమచ్చలు ఇబ్బందికరంగా మారాయా.. ఐతే ఈ టిప్స్ మీకోసమే..

-

ముఖంపై వచ్చే నల్లమచ్చలు చికాకు తెప్పిస్తుంటాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా వెళ్లలేకుండా చేస్తాయి. ముఖ బాగం ఒకచోట నల్లగా, మరో చోట తెల్లగా ఉండడంతో చూడడానికి అదోలా ఉంటుంది. ఐతే దీని గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. ఈ నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించి ఉంటారు. అయినా కూడా అవి పోకుండా ఇబ్బందిగానే అనిపిస్తుంటే కింద చెప్పేటి టిప్స్ ఫాలో అవడం బెటర్. మీ అందమైన ముఖంపై ఏర్పడ్డ నల్ల మచ్చలని మెల్లమెల్లగా పోగొట్టి, తిరిగి మీ ముఖాన్ని మరింత అందంగా మార్చే కొన్ని టిప్స్ తెలుసుకుందాం.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాని రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ పేస్టుని నల్లమచ్చలున్న భాగాలపై మర్దన చేయాలి. కొద్ది సేపయ్యాక వాటర్ తో శుభ్రపర్చుకుంటే చాలు.

టూత్ పేస్ట్

పళ్ళు తోముకోవడానికి వాడే టూత్ పేస్టు సాయంతో కూడా ఈ నల్లమచ్చలను తొలగించవచ్చు. టూత్ పేస్టుని బ్రష్ కి పెట్టుకుని నల్లమచ్చలున్న భాగాల్లో మెల్లగా తిప్పాలి. మరీ గట్టిగా తిప్పకండి. దానివల్ల మీ చర్మానికి ఇబ్బంది కలగవచ్చు. ఇలా కొన్ని రోజులు చేస్తే ఫలితం ఉంటుంది. కానీ ముందుగా ప్యాచ్ టేస్ట్ చేయడం మర్చిపోకండి.

తేనె

ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన తేనె మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్ని రోజులైనా పాడవని ఏకైక పదార్థంగా చెప్పుకునే తేనెలో కొద్దిగా చక్కెర కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసి, నల్లమచ్చలున్న భాగాల్లో రుద్దండి. తేనెలో ఉన్న పోషకాలు చర్మానికి సంరక్షణ కలిగిస్తాయి. నల్లమచ్చలని పోగొట్టడంలో తేనె చాలా సాయపడుతుంది.

చార్ కోల్ క్యాప్సుల్స్

యాక్టివేటెడ్ చార్కోల్ క్యాప్సుల్ రెండు తీసుకుని దానికి ఒక టీస్పూన్ జిలెటిన్ ని కలపాలి. ఆ పేస్టుని నల్లమచ్చలున్న భాగాల్లో వర్తింపజేయాలి. అలా చేస్తూ ఉంటే నల్లమచ్చలు చాలా ఈజీగా తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version