లాక్ డౌన్ తర్వాత… 4 కోట్లు దాటిన శ్రీవారి ఆదాయం

-

కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి…. తిరుమల దర్శనాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే… శ్రీ వారి దర్శనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో ఆదాయం కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఇక నిన్న తిరుమల శ్రీవారిని 30379 మంది భక్తులు దర్శించుకున్నారు. 15327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్న ఒక్క రోజే… శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు దాటేసింది.


ఏడాదిన్నర తరువాత నాలుగు కోట్లు దాటింది శ్రీవారి హుండి ఆదాయం. గత ఏడాది మార్చి 20వ తేది నుంచి కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో దర్శనాల నియంత్రణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శనాల నియంత్రణ సమయంలో మొదటిసారి నాలుగు కోట్లు దాటింది శ్రీవారి హుండి ఆదాయం. కాగా.. ఇవాళ శ్రీవారి ఆలయంలో శాస్రోక్తంగా దీపావళి ఆ స్థానం కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా వర్చువల్ ఆర్జిత సేవలు,విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version