తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే మాజీ అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం దీక్షితులు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన స్వీమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా సేవలు అందిచారు. పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు గత ఏడాది పదవీ విరమణ పొందారు.
తిరుమలలో ఎన్ని రకాలుగా కరోనాకి బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తున్నా… ఫలితం కనిపించట్లేదు. కొండకు వేర్వేరు రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తుల వల్లే కరోనా సోకుతోందనే అభిప్రాయం స్థానిక ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే 140 మంది టీటీడీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆలయ పెద్దజీయర్, చిన్న జీయర్‌కి కూడా కరోనా సోకింది. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేయాలని టీటీడీ ఆలోచిస్తుంది.