కుంభమేళాకు తిరుమల శ్రీవారి కళ్యాణరథం..

-

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళా జరుగనుంది. అందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణరథం బయలుదేరింది. కళ్యాణ రథానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూజలు చేశారు.

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాను ఘనంగా నిర్వహించనున్నారు.యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశారు. కుంభమేళాను దిగ్విజయం చేసేందుకు అందరు సహకరించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరాడు.

Read more RELATED
Recommended to you

Latest news