తిరుమల గురించి మీకు తెలియని నిజాలు!

-

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం అతి శక్తిమంతమైన దేవస్థానం. కోరిన కోర్కెలు తీర్చావాడు. ఇక్కడ శ్రీవారిని విగ్రహ రూపంలో ఆరాధిస్తారు. ఆ విగ్రహం గురించి మీకు తెలియన రహస్యాలు ఉన్నాయి.

తిరుమల

టీటీడీ అత్యంత ధనిక, ఆధ్యాత్మిక ప్రదేశం. మనకు ఈ దేవాలయం గురించి తెలిసిన వాటికంటే తెలియని నిజాలు మరెన్మో ఉన్నాయి. అవి, తిరుమల వేంకటేశ్వరునికి తల భాగంలో వెంట్రుకలు ఉన్నాయని, ఆయన పూజకు ఉపయోగించే వస్తువులు ఎక్కడి నుంచే తీసుకువస్తారు. ఆయన విగ్రహానికి చెమట పడుతుందని తిరుమల వెళ్లే భక్తులకు ఈ విషయం తెలీదు.

  • తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహరం ఉంటుంది. అది గమనిస్తే తెలుస్తుంది.
  •  తిరుమల దేవాలయంలో ఉపయోగించే పూలు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు తదితర వస్తువులను తిరుపతికి 22 కీ.మీ దూరంలో ఉండే ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే ప్రజలు చాలా నియమ నిష్టలతో ఉంటారు. గర్భగుడిలో అవసరమయ్యే ప్రతి వస్తువును ఈ గ్రామం నుంచే తీసుకువస్తారు.
  • వేంకటేశ్వరునికి నిజమైన పట్టులాంటి జుట్టు ఉంటుంది. వేంకటేశ్వరుడు భూమిపై ఉన్నపుడు ఊహించని ప్రమాదంలో తన జుట్టు కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది తెలిసిన నీలదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీవారు ఎవరైతే తనను దర్శించుకుని తలనీలాలు సమర్పిస్తారో వారికి నా అనుగ్రహం ఎల్లపుడు ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు.
  • శ్రీవారి విగ్రహం వెనుక ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందని, స్వామివారి విగ్రహం వెనుక చెవిపెట్టి వింటే తెలుస్తుంది. కానీ, ఈ అవకాశం శ్రీవారిని పూజించే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఉండదు.
  • గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందు మట్టి దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. స్వామి భక్తుల నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీక. ఈ దీపాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్నాయి.
  • శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో ఉంటుంది. అర్చకులు ఎన్నిసార్లు పొడిగా చేద్దామని ప్రయత్నించినా మళ్లీ తడిగా మారడం ఆశ్చర్యం కలిగిచే విషయం.
  • వేంకటేశ్వరునికి నిత్యం పూజించే పూలు, పూజారులు స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆ పూలు తిరుపతికి 20 కీమీ దూరంలో ఉండే వేర్పేడులో కనిపిస్తాయి.
  • పచ్చకర్పూరం ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి కొద్ది కాలంలోనే పగుళ్లు వస్తాయి. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. కానీ, ఇక్కడ శ్రీవారికి పచ్చకర్పూరం రాస్తున్నా ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇది అరుదు.

– 19వ శతాబ్దంలో దారుణ నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణ దండన విధిస్తాడు. చనిపోయే వరకూ ఉరితీయాలని ఆదేశిస్తాడు. మరణానంతరం మృతదేహాలను తిరుమల దేశాలయం గోడలపై వేలాడిదీస్తాడు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజరూపంలో కనిపించారని చెబుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version