తిరుపతి అభ్యర్థిని ప్రకటించిన జగన్.. సన్నిహితుడికే టికెట్ !

ఏపీలో ఆసక్తికరంగా మారిన తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి లోక్‌సభ అభ్యర్థిని వైసీపీ డిక్లేర్ చేసింది. డాక్టర్ గురుమూర్తి పేరును అధికారికంగా ప్రకటించింది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిత్వంపై కొద్ది రోజుల నుండి కసరత్తులు చేసిన వైసీపీ అధిష్టానం ఎట్టకేలకు గురుమూర్తిని బరిలోకి దించాలని నిర్ణయించింది. నిన్న తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి జగన్ పార్టీ సీనియర్ నేతలతో భేటీ నిర్వహించారు.

క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఈయన జగన్ కి వ్యక్తిగత ఫిజియోతెరపీ వైద్యుడుగా ఉన్నారు. గత ఏడాది ఎన్నికల ముందు జగన్ చేసిన పాదయాత్ర అంతటా ఈయన కూడా జగన్ వెంటే ఉన్నారు. తనను నమ్మిన డాక్టర్ కు జగన్ ఏకంగా ఎంపీ టికెట్ ప్రకటించడం గమనార్హం.