షాక్: టైటానిక్‌ షిప్ ఇక కనిపించదా..! వీడియో

-

1997లో వ‌చ్చిన `టైటానిక్` చిత్రం సెన్సేష‌న్ సృషించింది. టైటానిక్ ఫిప్ సముద్రంలో ఎలా మునిగిపోయిందో చెబుతూ ఈ ప్రేమ కథా చిత్రం సాగుతుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. చరిత్రలో నిలిచిపోయిన విషాద గాధ. తరాలు మారినా ఈ సినిమాకి ఉన్న ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. లియోనార్డో డికాఫ్రియో, క్లేట్ విన్స్‌లెట్ ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా న‌టించారు.


అయితే ఇది క‌థ కాదు నిజంగానే జ‌రిగిందన్న‌ది తెలిసిందే. 1912 ఏప్రిల్ 10న ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ నుంచి 2240 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నగరానికి బయలుదేరిన టైటానిక్ షిప్.. గమ్యస్థానం చేరకుండానే కెనాడాకు 387 మైళ్ల దూరంలో సముద్రంలో మునిగిపోయింది. దాదాపు 4000 మీట‌ర్ల లోతులో అట్లాంటిక్ మ‌హా స‌ముద్రంలో ఇది మునిగిపోయింది.

1912లో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను 1985లో అంటే.. 70 సంవ‌త్స‌రాల త‌ర్వాత దాన్ని గుర్తించారు. అప్ప‌టికే అది చాలా వ‌ర‌కు పాడ‌వుతున్న ప‌రితిస్థి క‌నిపించింది. ఈ ప్రమాదంలో దాదాపు 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నాలుగు సంవ‌త్స‌రాల పాటు ఈ షిప్‌ను త‌యారు చేస్తే దీని చ‌రిత్ర కేవ‌లం నాలుగు రోజుల్లో ముగిసిపోయింది. అయితే ఈ షిప్ మునిగిపోవడం వెనుక ఎన్నో కథలు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికి టైటానిక్ మునిగిపోయి 107 సంవ‌త్స‌రాలు అవుతుంది. ప్ర‌స్తుతం దీని గురించి ఎందుకు ?చెప్పుకుంటున్నామంటే.. ఇన్ని సంవత్సరాలు సముద్ర గర్భంలో ఉన్న ఈ షిప్‌కు ప్రమాదం పొంచి ఉందని ఇటీవ‌ల టైటానిక్‌ను ప‌రిశీలించిన నిపుణులు చెబుతున్నారు. సముద్రంలోని ఉప్పు నీటి కోత వల్ల టైటానిక్‌కి సంబంధించిన లోహ భాగాలు దెబ్బతింటున్నాయని, ఇలాగే ఉంటే మరో ముప్పై ఏళ్లలో టైటానిక్ ఆనవాళ్లు కనుమరుగవుతాయని చెబుతున్నారు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు టైటానికి శిథిలం అయిపోయింద‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news