మీ పిల్లలు ఏకాగ్రత పెట్టలేక పోతున్నారా..? పిల్లల్లో ఏకాగ్రతని పెంచే అలవాట్లు ఇవి. ఇలా చేశారంటే మీ పిల్లలు ఏకాగ్రత బాగా పెరుగుతుంది ఏ పని చేసినా కచ్చితంగా ఏకగ్రత పెట్టాలి లేకపోతే ఆ పని పూర్తికాదు. పైగా ఆ పనికి అర్థం కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఏకగ్రతతో చేయాలి ఏకాగ్రతతో పని చేయడంతో అనుకున్న లక్ష్యాలని సులభంగా మనం సాధించడానికి అవుతుంది చాలామంది ఏకాగ్రతని కోల్పోతున్నారు అయితే ఇలా ఏకగ్రతని పెంచొచ్చు.
పరధ్యానం వలన చాలామంది ఏకగ్రత పెట్టలేకపోతుంటారు కాబట్టి పరధ్యానం వద్దు. మీరు పని చేసేటప్పుడు ఆగి బ్రేక్ తీసుకుని చేయండి. చాలామంది వర్క్ ఒత్తిడి వలన అన్ని పనుల మీద ధ్యాస సరిగా పెట్టలేరు. అటువంటిప్పుడు ఒక పది నిమిషాలు పాటు విరామం తీసుకుని పని మొదలు పెట్టండి ఇక మీకు తిరుగు ఉండదు. మ్యూజిక్ వింటే కూడా ఏకాగ్రత పెంపొందించుకోవచ్చు.
శ్వాసకి సంబంధించిన వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే కూడా ఏకగ్రత బాగా పెరుగుతుంది పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఇలా కూడా మీరు చేయండి. ధ్యానం చేస్తే కూడా ఏకాగ్రత పెరుగుతుంది మంచి నిద్రని పిల్లలు పొందితే ఏకగ్రత పెడతారు. పెద్దలు కూడా రోజు ఫుల్లుగా నిద్రపోవాలి వ్యాయామం, ప్రకృతి మధ్య కాసేపు గడపడం వలన కూడా ఏకాగ్రతని పెంపొందించుకోవచ్చు పెద్దలు పిల్లలు ఎవరైనా ఈ పద్ధతులతో ఏకాగ్రతను సులభంగా పెంచుకోవచ్చు.