ఫ్యాక్ట్ చెక్: రూ.12,500 కడితే.. రూ.4 కోట్ల 62 లక్షలు..? ఈ ఈమెయిల్స్ ని నమ్మచ్చా..?

-

నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అందులో నిజం ఎంత అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో మెయిల్స్ వస్తున్నాయి.

ఇంతకీ మెయిల్ ఏంటంటే రూ.12,500 ని కడితే నాలుగు కోట్ల 62 లక్షల రూపాయలు వస్తాయని ఆ మెయిల్ లో ఉంది. మరి నిజంగా మనం డబ్బులు కట్టొచ్చా..? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపించిన ఈ మెయిల్ లో నిజం ఎంత అనే విషయానికి వచ్చేస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది.

ఇందులో ఏమాత్రం నిజం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి మెయిల్స్ ని పంపించట్లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది కనుక అనవసరంగా ఇటువంటి వాటిని నమ్మి మోసపోకండి. నకిలీ వార్తలని చూసి డబ్బులు కడితే మీకు నష్టం.

Read more RELATED
Recommended to you

Latest news