వాట్సాప్ ని ఓపెన్ చెయ్యాలంటే.. ఇక నుండి పిన్ తప్పనిసరి..!

-

వాట్సాప్ మనకి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. వాట్సాప్ ద్వారా మెసేజెస్ ని పంపుకోచ్చు. అలానే వీడియో కాల్స్ ని కూడా చేసుకోవచ్చు. పైగా ఇంకా ఎన్నో ఫీచర్స్ వున్నాయి. అలానే రోజు రోజుకి కొత్త ఫీచర్స్ ని కూడా వాట్సాప్ తీసుకు వస్తోంది. తాజాగా వాట్సాప్ పోల్ ఫీచర్ ని తీసుకు వచ్చింది. ఇక ఈ ఫీచర్ కి సంబంధించి వివరాలు చూద్దాం. ఓ ఫీచర్ ని వాట్సాప్ తీసుకు వచ్చింది. ఈ ఫీచర్ తో వాట్సాప్ ని పిన్ లేకుండా ఓపెన్ చేసేందుకు అవ్వదు. వాట్సాప్ ని ఓపెన్ చేయాలంటే పిన్ ని తప్పక ఎంటర్ చేయాలి. ఇక ఎలా ఈ ఫీచర్ పని చేస్తుంది అనేది చూద్దాం.

స్క్రీన్ లాక్ అనే పేరుతో ఈ ఫీచర్ ని తీసుకు వస్తున్నారు. డెస్క్ టాప్ లో యాప్ ని ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది దీని మూలంగా ఏమవుతుందంటే యూజర్ చాట్ సంభాషణలకు అదనపు భద్రత కలుగుతుంది. ఇప్పుడు దీని మీద టెస్టింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ ఫీచర్ వస్తుంది. ఇప్పటివరకు వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ కు సెక్యూరిటీ లేదు, ఒక్క సారి డెస్క్ టాప్ లో లాగిన్ చేస్తే తర్వాత మళ్లీ లాగిన్ చేయక్కర్లేదు.

కంప్యూటర్ లేదా పీసీ ద్వారా మీరు వాట్సాప్ ని ఉపయోగించినప్పుడు వాట్సప్ యాప్ ను యాక్సిస్ చేయొచ్చు. దీనివలన పర్సనల్ డేటా కి సెక్యూరిటీ లేక పోతోంది ఈ సమస్యను తొలగించేందుకు వాట్సాప్ మొబైల్ యాప్ లానే డెస్క్ టాప్ లో కూడా స్క్రీన్ లాక్ ఫీచర్ ని తీసుకొచ్చారు. పాస్వర్డ్ ఎంటర్ చేయడం తో పాటుగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీని కూడా తీసుకురావడం జరుగుతుంది. త్వరలోనే ఈ ఫీచర్ ని వాట్సాప్ తీసుకొస్తున్నట్లు తెలుపుతోంది. సెన్సార్ ఉన్న కంప్యూటర్ లేదా లాప్టాప్ యూజర్లు వాట్సాప్ యాప్ కి ఫింగర్ ప్రింట్ లాక్ ని పెట్టుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version