గత వారం రోజు రోజుకి పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా సోమవారం భారీగా పడిపోయింది. దాదాపు రెండు వేల వరకు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర 1900 వరకు తగ్గడం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 1940 రూపాయల తగ్గి… 39,830 రూపాయలుగా చేరుకోగా… 24 క్యారెట్ల బంగారం ధర 1925 రూపాయల తగ్గింది.
దీనితో 43,375 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాములకు 1940 రూపాయల వరకు తగ్గడం తో 39,830 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… పది గ్రాములకు 1925 రూపాయలు తగ్గడంతో… 43,375 రూపాయలకు చేరుకుంది. వెండి ధర కూడా అంతే తగ్గింది. 39,500 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1490 రూపాయల తగ్గడంతో… 43,710 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1150 రూపాయల వరకు తగ్గడంతో… 41,410 రూపాయలకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా బంగారంకు డిమాండ్ భారీగా తగ్గింది. అసలు ఎవరో కూడా కరోనా ప్రభావం తో బంగారం కొనుగోలు చేయడం లేదు.