బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా పుణ్యమా అని ఇన్ని రోజులు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు తగ్గడం గమనార్హం. కరోనా ప్రభావం తో డిమాండ్ భారీగా పడిపోయింది. జనాల వద్ద డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఉన్న డబ్బులు అన్నీ కూడా దాచుకుని వాడుకోవాలి. ఆభరణాలు కొంటె పిల్లలను పస్తులు పడుకోబెట్టాలి. కొనడానికి కూడా బయట మార్కెట్ కి వెళ్ళే పరిస్థితి లేదు.
దీనితో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర… 22 క్యారెట్లు పది గ్రాములకు 70 రూపాయల వరకు తగ్గింది. దీనితో 39,440 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 80 రూపాయల వరకు తగ్గడంతో 43,080 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం లలో 22 క్యారెట్లు పది గ్రాములకు 70 రూపాయల తగ్గింది.
39,440 రూపాయల వరకు తగ్గడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 80 రూపాయల వరకు తగ్గింది. 43,080 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80 రూపాయల తగ్గింది. తగ్గుదలతో 43,210లకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయలు తగ్గడంతో… 40,940 రూపాయలకు చేరుకుంది. 40 వేల మార్కు వద్దకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,940 రూపాయల వద్ద నిలిచింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.