గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ పెరిగాయి. దేశీయ మార్కెట్ అంతటా బంగారం ధరలు మారకపోయినా తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.180 పెరగడంతో రూ.45,980కు వెళ్ళింది. 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరగడంతో రూ.42,160కు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే 24 క్యారెట్ల 10గ్రా బంగారం ధర .44,050 వద్ద నిలకడగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,850లో ఏ మార్పులు లేవు. ఇక వెండి ధర రూ.1000 తగ్గుదలతో రూ.48,500కు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం తగ్గింది. 1660 డాలర్లకు దిగింది. ఔన్స్‌కు 0.16 శాతం తగ్గింది. దీనితో 1657.40 డాలర్ల వరకు తగ్గింది.
వెండి విషయానికి వస్తే దేశీయంగా వెండి తగ్గింది. కేజీ వెండి ధర రూ.1,000 మేర తగ్గింది. కేజీ వెండి ధర రూ.48,500కు దిగొచ్చింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి క్రమంగా డిమాండ్ పెరుగుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలో పెళ్ళిళ్ళు ఉన్న నేపధ్యంలో బంగారం ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.