ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ..

-

ఆర్టీసీ సమ్మె 24వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఆర్టీసీ జేఏసీ ఛలో కలెక్టరేట్లకు పిలుపునిచ్చింది. ఆర్టీసీ కార్మికులు, కుటుంబాలతో సహా పలు పక్షాల నేతలు కలెక్టరేట్ల ముట్టడిలో పాల్గొననున్నారు. కాగా, కార్మిక సంఘాలు పట్టు వీడకపోవడం. ఆర్టీసీ యాజమాన్యం మెట్టు దిగకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. 26 డిమాండ్లపై చర్చలు జరుపాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చలు జరుపుతామని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

ఇక ఆర్టీసీ సమ్మెపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరుగనుంది. శనివారం జరిగిన చర్చల అంశాలపై ప్రభుత్వం నివేదిక అందించనుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చల నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయారని ప్రభుత్వం కోర్టుకు నివేదిక అందించనుంది. ప్రభుత్వం అందించే నివేదికపై హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version