కెప్టెన్ రోహిత్ , కోచ్ ద్రావిడ్ కు తొలి ప‌రీక్ష నేడే

-

టీమిండియా టీ ట్వంటి జట్టు కు ఇటీవ‌ల స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఎంపిక అయిన విష‌యం తెలిసింది. అలాగే టీమిండియా కు కొత్త‌గా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కూడా ఎంపిక అయ్యాడు. అయితే ఈ కొత్త బృందం తొలి ప‌రీక్ష నేడు ఉంది. ఈ తొలి ప‌రీక్ష కు టీ ట్వంటి రోహిత్ శ‌ర్మ తో పాటు టీమిండియా కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సిద్ధం అవుతున్నారు. ఈ రోజు భార‌త్ టూర్ కు వ‌చ్చిన న్యూజిలాండ్ తో తొలి టీ ట్వంటి మ్యాచ్ జ‌ర‌గ‌బోతుంది. జైపుర్ వేదిక గా ఈ మ్యాచ్ జ‌రుగుతుంది.

అయితే న్యూజిలాండ్ కూడా కొత్త కెప్టెన్ టీమ్ సౌథీ తో బ‌రి లోకి దిగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కెప్టెన్ గా ఉన్న కేన్ విలియ‌మ్ స‌న్ టీ ట్వంటి కెప్టెన్ నుంచి త‌ప్పు కున్నాడు. కెన్ పూర్తి దృష్టి టెస్ట్ ప్ర‌పంచ క‌ప్ పై పెట్ట‌డానికి టీ ట్వంటి కెప్టెన్ నుంచి త‌ప్పుకున్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో విజ‌యం సాధించి భార‌త్ కెప్టెన్, కోచ్ ప‌వ‌ర్ చూపించాల‌ని అనుకుంటుంది. అలాగే టీ ట్వంటి ప్ర‌పంచ కప్ ఫైన‌ల్ ఓడి పోయిన న్యూజిలాండ్ ఇండియా పై గెలిచి ప‌రువు ను తిరిగి సంపాదించు కోవాల‌ని చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version